![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ బ్యూటీ విత్ బ్రెయిన్ తేజస్విని మాదివాడ గురించి అందరికీ తెలుసు. " లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ పాప తర్వాత "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ మూవీలో అందాలు ఆరబోసి నవదీప్ పక్కన బాగా హైలైట్ అయ్యింది ఈ క్యూటీ బ్యూటీ. ఇక తేజస్విని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది... తన ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రకాల ఫోటోషూట్ వీడియోస్, జిమ్ వర్కౌట్ వీడియోస్ వంటివి పోస్ట్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. "నా మంచిలోనూ, నా చెడులోనూ నన్ను మీ కన్న తల్లిలా చూసుకుని, నాకు భోజనం ఇచ్చి, నన్ను అపురూపంగా చూసుకున్న అమ్మలందరికోసం ఈ పోస్ట్...మీ కోసం ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను. నా మనసారా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. అమ్మలాంటి నాన్నల కోసం కూడా" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక క్యూట్ కామెంట్ ని పోస్ట్ చేసింది. అలాగే మరో స్టేటస్ లో చక్కగా పొందిగ్గా చీర కట్టుకుని పూలు పెట్టుకుని పక్కన ఒక పాత టేప్ రికార్డర్ ని పెట్టుకుని ఆ పాత మధురంలా అనిపించేలా "మమ్మి ఇన్ మీ" అంటూ తనలోనూ అమ్మతనం ఉందనే విధంగా ఒక నాచురల్ పిక్ ని పోస్ట్ చేసింది. తేజస్విని ఎంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షాప్ ఓపెనింగ్ ని వెళ్ళింది. ఇక టైం దొరికితే తన ఇంట్లోని క్యూట్ పుప్పి తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
![]() |
![]() |